Monday, March 19, 2018

Nomulu Vratalu

పదహారు ఫలాల నోము

పూర్వకాలంలో ఒకానొక రాజ్యంలో ఆ రాజుగారి భార్య మంత్రి భార్య పదహారు ఫలాల నోము నోచుకున్నారు. రాజు భార్యకు గుణ హీనులు, గ్రుడ్డివారు కుంటివారు కుమారులుగా పుట్టారు. మంత్రి భార్యకు రత్నమానిక్యాల్లాంటి సుగుణ గుణ సంపన్నులు కలిగారు. ఇందుకు రాజు భార్య ఎంతగానో చింతించింది. మంత్రి భార్యను కలుసుకుని ఏమమ్మా! నువ్వు నేను కలిసే గదా పదహారు ఫలాల నోమును నోచుకున్నాము. మరి నాకిట్టి బిడ్డలు, నీకు అటువంటి బిడ్డలు పుట్టుటకు కారణమేమిటి అని అడిగింది.
అందుకా మంత్రి భార్య బాగా ఆలోచించి రాని గారికి ఈ విధంగా చెప్పింది. మహారాణి! మీరు వ్రాతకాలంలో వినియోగించే పళ్ళను ఒక రోజు ముందుగానే సమకూర్చుకుని వాటిని కోటలో నోలివచేసినారు. వాటిలో వున్న వంకర పళ్ళు, మచ్చలున్న పళ్ళు, పాడిన పళ్ళను గుర్తించక, వాటిని వేరుచేయక పేరంటాల్లకు పంచి పెట్టారు. అలా అశ్రద్ధ చేసినందువల్ల మీకు కలిగిని సంతానం కుంతీ, గుడ్డి, గునహీనులు అయ్యారు. మీరు విచారించకండి ఈ పదహారు ఫలాల నోము చాలా శక్తివంతమైన నోము, స్త్రీలపాలిట పెన్నిది, కనుక మీరు మరలా పదహారు ఫలాల నోమును నోయండి. చక్కనైనవి శుబ్రమైనవిగా వున్న ఫలాలను సమకూర్చుకుని వాటిని ముత్తైదువులకు పువ్వులు, దక్షిణ తామ్బూలాడులతో వాయనమివ్వండి అని చెప్పింది.
రాని మంత్రి భార్య చెప్పిన ప్రకారం మంచి పళ్ళను సమకూర్చుకుని, ఎంతో భక్తి శ్రద్దలతో పదహారు ఫలాల నోమును నోచుకున్నది. అలా ఈ నోము విశేషం వలన ఆమె సంతానం సర్వాంగ సుందరంగా మారడం జరిగింది. అందుకా రాని ఎతగానో ఆనందించింది.
ఉద్యాపన: పరిశుబ్రమైన పదహారు రకాల పళ్ళు ఎంచుకొని సమకూర్చుకోవాలి. ఒక్కొక్క పండును, పువ్వులను దక్షిణ తామ్బూలాలను ముత్తైదువునకు ఇవ్వాలి. తదుపరి సంతర్పణం చెయ్యాలి

Silk Thread Bangles





Silk thread bangles, hand crafted to suit to your requirement. Available in a wide range of designs and sizes. To know more, contact vamita74@gmail.com .